Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీ రఘురామకు విజ‌య‌సాయి షాక్! రూ.826 కోట్ల కుంభకోణం!!

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (08:22 IST)
వైసీపీలో గ‌త ఏడాదిగా సాగుతున్న టామ్ అండ్ జెర్రీ పొలిటిక‌ల్ గేమ్ చ‌ర‌మాంకానికి చేరిన‌ట్లుంది. పార్టీలో ఉంటూనే రెబ‌ల్ గా మారిన ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఊహించని షాకిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ పిటిషన్‌ను స్వీకరించిన సీబీఐ కోర్టు ఎంపీ విజయసాయిరెడ్డిని ఈ నెల 10లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామకు విజయసాయిరెడ్డి ఊహించని షాకిచ్చారు. ఎంపీ రఘురామకు చెందిన కంపెనీ రూ. 826 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిందని కేంద్ర ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.

ఈ లేఖపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, విచారణ వేగవంతం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ‘‘ఎంపీ రఘురామరాజుకు చెందిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించి రూ. 826 కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసులో తీవ్ర జాప్యం జరుగుతోందని నేను రాసిన లేఖకు కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు స్పందించారు. విచారణ వేగవంతం అయ్యేలా చూస్తామని తెలిపారు.’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అంగరంగ వైభవంగా నటుడు నెపోలియన్ కుమారుడు వివాహం

కిరణ్ అబ్బవరం హార్డ్ వర్క్, టాలెంట్ కు దక్కిన ఫలితమే క విజయం

పాన్ ఇండియా చిత్రాలకు ఆ తమిళ హీరోనే స్ఫూర్తి : ఎస్ఎస్.రాజమౌళి

రెబల్ స్టార్ ప్రభాస్ తో మూడు మెగా సినిమాలు ప్రకటించిన హోంబలే ఫిల్మ్స్

'అమ్మ'కు ఆఫీస్ బాయ్‌గా కూడా పని చేయను : మోహన్ లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments