Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మాగుంటకు ఈడీ నోటీసులు

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (16:27 IST)
ఢిల్లీ మద్యం స్కామ్‌లో వైకాపాకు చెందిన ఒంగోలు ఎంపీ మాగుంటి శ్రీనివాసులు రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నోటీసులు జారీచేశారు. అందులో ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే మాగుంట తనయుడు రాఘవరెడ్డి ఈ కేసులో అరెస్టయి జైలులో ఉన్న విషయం తెలిసిందే.
 
మద్యం కేసులో గురువారం అరుణ్‌ పిళ్లైని కోర్టులో హాజరు పరిచిన అధికారులు.. ఐదు రోజుల పాటు కస్టడీకి కోరారు. ఇతర నిందితులతో కలిపి పిళ్లైని ప్రశ్నించాల్సి ఉందని కోర్టుకు తెలుపగా.. 3 రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది.
 
అలాగే, కొందరు నిందితులు, సాక్షులను కలిపి ప్రశ్నిస్తున్నామని చెప్పిన ఈడీ అధికారులు.. కొందరిని మళ్లీ విచారణకు పిలిచినట్టు కోర్టుకు తెలిపారు. అదేవిధంగా గురువారం విచారణకు ఎమ్మెల్సీ కవిత రాలేదని కోర్టుకు ఈడీ సమాచారం ఇచ్చింది. 
 
పిళ్లై కస్టడీ పొడిగిస్తే శుక్రవారం బుచ్చిబాబుతో కలిసి ప్రశ్నిస్తామంది. ఈ కేసులోనే వైకాపా ఎంపీ శ్రీనివాసుల రెడ్డికి నోటీసులు ఇచ్చినట్టు న్యాయస్థానానికి ఈడీ తెలిపింది. ఢిల్లీ మద్యం కేసు మూలాలు ఏపీలోనే ఉన్నట్టు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments