Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ రబ్బర్ సింగో, గబ్బర్ సింగో తేల్చుకోవాలి: వైసీపీ ఎమ్మెల్యే రోజా

సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ రబ్బర్ సింగో, గబ్బర్ సింగో తేల్చుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ప్లీనరీ సందర్భంగా పవన్ కల్యాణ్‌పై రోజా విమర్శలు గుప్పి

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2017 (09:06 IST)
సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ రబ్బర్ సింగో, గబ్బర్ సింగో తేల్చుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ప్లీనరీ సందర్భంగా పవన్ కల్యాణ్‌పై రోజా విమర్శలు గుప్పించారు. ప్ర‌శ్నిస్తానన్న మొనగాడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడెక్క‌డున్నార‌ని రోజా నిల‌దీశారు. కాపులను ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేస్తుంటే పవన్ ప్ర‌భుత్వాన్ని ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని అడిగారు. 
 
చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌న‌ని చెప్పుకున్న జ‌న‌సేనాని ఇప్పుడు జీఎస్టీ వ‌ల్ల ప‌డ‌బోతున్న ప‌న్నుపోటు గురించి ఎందుకు అడ‌గ‌డం లేద‌ని ఆమె విమ‌ర్శ‌లు చేశారు. పనిలో పనిగా ఏపీ సర్కారుపై రోజా నిప్పులు చెరిగారు. గిరిజ‌నుల‌ ఓట్ల కోసం కొండలు ఎక్కి వారిని క‌లిసే రాష్ట్ర‌మంత్రులు.. ఇప్పుడు గిరిజ‌నుల ఆరోగ్యాలు పాడైపోతుంటే కనీసం నీళ్లు కూడా ఇవ్వ‌డం లేద‌న్నారు. 
 
చంద్రబాబును నమ్మి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశంలో చేరిన నేతల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి అనతి కాలానికే గుండెపోటుకు గురి కాగా, జ్యోతుల నెహ్రూ వెన్నుపోటుకు గురయ్యారన్నారు. మంత్రి పదవి ఆశ చూపి జ్యోతుల నెహ్రూను తెలుగుదేశం పార్టీలోకి లాగారన్నారు. చంద్రబాబు విసిరిన బిస్కెట్లకు ఆశ పడి పార్టీ మారిన నెహ్రూ చివరకు వెన్నుపోటుకు గురయ్యారని ఎద్దేవా చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments