Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును పవన్‌కు వీరాభిమాని.. కాటమరాయుడిని 9సార్లు చూశా: వైసీపీ ఎమ్మెల్యే

యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.. ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న ఈయన పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కి వీరాభిమాని. ఎంతలా అంటే.. పవన్ ఫ

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (11:46 IST)
యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.. ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న ఈయన పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కి వీరాభిమాని. ఎంతలా అంటే.. పవన్ ఫ్లాప్ సినిమా కాటమరాయుడిని తొమ్మిది సార్లు చూసేంత.

ఫస్ట్ షోలోనే సినిమాను చూశాను.. ఇందులో తప్పేముంది.. తాను పవర్ స్టార్ అభిమానిని.. సినిమా బాగున్నా.. బాగలేకపోయినా.. అది నాకు అనవసరం. తనకు నచ్చే నాయకుడి సినిమాను చూస్తానని క్లారిటీ ఇచ్చారు. జానీ సినిమాను కూడా తొమ్మిదిసార్లు చూశానని బదులిచ్చారు.. అనిల్ కుమార్ యాదవ్. 
 
ఇంకా తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అనే సూత్రం పవన్‌పై తనకున్న అభిమానం విషయంలో స్పష్టంగా వర్తిస్తుందని అనిల్ కుమార్ అన్నారు. ఎందుకంటే..? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయిన తనకు రాజకీయంగా పవన్‌కి వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా రావచ్చు. అయితే రాజకీయాలు వేరు సినిమా వేరు అని చెప్పారు. ఏది ఏమైనా తాను మాత్రం పవన్‌కి పెద్ద ఫ్యాన్.. వీరాభిమాని అంటూ ఇంటర్వ్యూలో వెల్లడించి.. షాకిచ్చారు. 
 
డాక్టర్‌కు చదువుకుని.. తండ్రి మరణానికి తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్.. తొలిసారి 90 ఓట్లతో ఓడిపోయినప్పటికీ.. రెండోసారి మాత్రం 19వేల ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments