జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై వైకాపా నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం ఇప్పటంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో జనసేనాని మాట్లాడారు. పవన్ జగన్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కౌంటర్లు ఇస్తున్నారు.
తాజాగా అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. "జనసేన సైనికులారా.. తెలుగుదేశం పల్లకి మోయడానికి సిద్ధం కండి! ఇదే జనసేన ఆవిర్భావ దినోత్సవ సందేశం!!" అలాగే మరో ట్వీట్‌లో.. ‘బాబు గారికి నమస్కారం పెట్టడం.. జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టకపోవడం.. అదే మీ సంస్కారం !’ విమర్శించారు.
అంబటి విమర్శలకు పవన్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు కౌంటర్ ఇస్తున్నారు. తమ అధినేత అంటే మంత్రులకు, ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందని.. అందుకే విమర్శిస్తున్నారంటున్నారు.