Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ బడ్జెట్.. నిరుద్యోగులకు శుభవార్త.. ట్యాబ్‌లో బడ్జెట్ ప్రసంగం... వావ్

రాజధాని అమరావతి వేదికగా తీసుకొచ్చిన తొలి బడ్జెట్‌ పద్దును బుధవారం ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్రం విడిపోయాక నవ్యాంధ్రలో నిర్మించిన తాత్కాలిక శాసనసభలో ప్రవేశపె

Webdunia
బుధవారం, 15 మార్చి 2017 (11:37 IST)
రాజధాని అమరావతి వేదికగా తీసుకొచ్చిన తొలి బడ్జెట్‌ పద్దును బుధవారం ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్రం విడిపోయాక నవ్యాంధ్రలో నిర్మించిన తాత్కాలిక శాసనసభలో ప్రవేశపెట్టిన తొలి స్మార్ట్‌ బడ్జెట్‌‌గా పేరు కొట్టేసింది. ఈసారి బడ్జెట్ ప్రతులతో పాటు ట్యాబ్‌లను సైతం సభ్యులకు అందించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బడ్జెట్‌ ప్రసంగాన్ని ట్యాబ్‌ ద్వారా వీక్షించారు.
 
ఇకపోతే.. బుధవారం ఏపీ రాజధాని అమరావతి వేదికగా తొలి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రపంచస్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు. విభజనతో ఎన్నో రంగాలకు వూతమివ్వడం, అందరికీ ఉపాధి కలిగించేలా పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం, సుపరిపాలన అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. 
 
విభజన తర్వాత ఎన్నో సవాళ్లు తట్టుకుని గొప్ప పరిణితి తీసుకురాగలిగామని.. రెండున్నరేళ్ల కాలంలో ఎంతో పురోభివృద్ధి సాధించామని తెలిపారు. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. విజన్‌ 2029లో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఈ బడ్జెట్‌ ప్రతిబింబిస్తుందని వెల్లడించారు. అలాగే అమరావతి కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 10వేల ఉద్యోగాలను భర్తీ చేయనుందని యనమల చెప్పారు. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments