Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్యాంధ్ర కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరా? : యనమల స్పందన!!

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (15:18 IST)
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి స్వర్గీయ ఎన్టీఆర్ సిటీ అనే పేరు పెట్టే అంశంపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ఇదే అంశంపై ఆయన సోమవారం స్పందిస్తూ... నవ్యాంధ్ర కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. 
 
రాజధాని పేరుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. నవ్యాంధ్ర రాజధానికి దివంగత నేత ఎన్టీ రామారావు పేరు పెట్టాలన్న డిమాండ్లు పలు వర్గాల నుంచి వినిపిస్తున్నాయని ఆయన తెలిపారు. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, భూసేకరణ పూర్తయిన తర్వాత రాజధాని పేరుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. 
 
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఆ దిశగా పని చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఏమి జరుగుతుందో కూడా తెలియని ప్రతిపక్ష నేత జగన్... అసెంబ్లీ సమావేశాల్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశం విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... ప్రభుత్వంతో చర్చించకుండానే ప్రతిపక్షం ఆందోళనకు దిగడం సరైంది కాదని సూచించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments