Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెదిరించినట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా: ఎమ్మెల్యే కన్నబాబు

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (15:28 IST)
తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థిని బెదిరించినట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, ఒక వేళ తాను బెరించినట్టు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు ప్రకటించారు.
 
ఈయనపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీతపాలెంలో వార్డు మెంబర్‌గా పోటీ చేస్తున్న వ్యక్తిని బెదిరించారనే ఫిర్యాదుతో మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ 506, 171ఎఫ్‌తోపాటు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పోలీసులు మరో కేసు నమోదు చేశారు. 
 
ఈ సందర్భంగా కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ, తాను ఎవరినీ బెదిరించలేదని.. బెదిరించినట్లు నిరూపిస్తే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఏకగ్రీవమైతే గ్రామానికి రూ. 15 లక్షలు వస్తుందని, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చునని చెప్పానని వివరించారు. 
 
కాగా, తాజాగా విశాఖ జిల్లా ఎలమంచిలి ఎమ్మెల్యే(వైసీపీ) యూవీ రమణమూర్తిరాజు(కన్నబాబురాజు) ఓ అభ్యర్థి అల్లుడికి ఫోన్‌ చేసి బెదిరించిన ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆయన నియోజకవర్గంలోని రాంబిల్లి మండలం లాలంకోడూరు పంచాయతీ సీతపాలెం పదో వార్డు సభ్యుడిగా రుత్తల సత్యం అనే వ్యక్తి నామినేషన్‌ వేశారు. 
 
ఆయన కూడా వైసీపీకి చెందిన వ్యక్తే. అయితే ఎమ్మెల్యే కన్నబాబురాజు మరో వ్యక్తితో ఆ వార్డుకు నామినేషన్‌ వేయించారు. సత్యం రెబల్‌గా మారారు. సత్యం అల్లుడు సంతోష్‌ వన సంరక్షణ సమితి అధ్యక్షుడిగా ఉన్నారు. రెండురోజుల క్రితం సంతోష్‌కు ఎమ్మెల్యే కన్నబాబురాజు ఫోన్‌ చేసి తీవ్రస్థాయిలో బెదిరించారు. నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోవాలని ఆదేశించారు. 
 
దీనిపై సంతోష్ బుధవారం రాంబిల్లి ఠాణాలో ఫిర్యాదు చేయగా, ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఆడియో రికార్డింగ్‌నూ పోలీసులకు అందజేశారు. తన మామ ఇల్లు పడగొడతానని కూడా ఎమ్మెల్యే బెదిరించారని, ఆ మరుసటిరోజే అధికారులు ఇల్లు పడగొట్టడానికి ప్రయత్నించారని, వైసీపీలో మరో నాయకుడు డీఎస్‌ఎన్‌ రాజు తన కుటుంబాన్ని కడతేరుస్తానని బెదిరించారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఎమ్మెల్యే చేసిన బెందిరింపులను ఓ సారిపరిశీలిస్తే, 
 
ఎమ్మెల్యే: ఏం నామినేషన్‌ వేశావట. వెటకారంగా ఉందేటి? 
సంతోష్‌: నేను కాదు సార్‌.
ఎమ్మెల్యే: నువ్వు కాకపోతే...నీ మావ. మావో..గీవో.. నువ్వు చెప్పు. లేదంటే రేంజర్‌తో కంప్లయింట్‌ చేయించి బొక్కలో తోయించేస్తాను.  
సంతోష్‌: నాలుగేళ్ల నుంచి రేంజర్‌ బిల్లు ఇవ్వలేదు సార్‌. రూ.2.5 లక్షలు రావాలి.
ఎమ్మెల్యే: ఒక్క రూపాయి కూడా రాదు. ఆలోచించుకో.
సంతోష్‌: ఇవ్వకపోతే పోనీయండి సార్‌. అడుక్కొని తింటాం.
ఎమ్మెల్యే: అలాగైతే దానికి ప్రిపేర్‌ అయిపో...
సంతోష్‌: అది కాదు సార్‌. ఊళ్లో పెద్దలంతా కలిసి నిలబెట్టారు.
ఎమ్మెల్యే: నోర్ముయ్‌...! ఎవడ్రా పెద్దలు.? అంత మొగాడు ఎవడూ లేడక్కడ...
సంతోష్‌: సుమంత్‌ చిన్నాన్న నిలబెట్టారు సర్‌.
ఎమ్మెల్యే: అదే.. ఆ సుమంత్‌ గాడి మిషన్‌, బిల్డింగ్‌ తెల్లారేసరికి కొడతారు. సూద్దురు గాని.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments