Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభలపై నృత్యాలు చేసే డ్యాన్సర్లను కోర్కె తీర్చమన్న వైకాపా నేతలు

Webdunia
సోమవారం, 9 మే 2022 (08:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా నేతలు ఆగడాలు నానాటికీ హెచ్చుమీరిపోతున్నాయి. ఇప్పటికే తమకు ఎదురుతిరిగే, ప్రశ్నించే ప్రజలను వైకాపా నేతలు చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసులు పెట్టించడం, స్టేషన్లకు పిలిచి చావబాదడం, బహిరంగంగానే దాడులు చేయడం, ఇళ్లను కూల్చివేయడం, తగలబెట్టడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారు. 
 
ఈ క్రమంలో తాజాగా ప్రభలపై నృత్యాలు చేస్తూ పొట్టపోసుకునే డ్యాన్సర్లను కూడా వైకాపా నేతలు వదిలిపెట్టలేదు. తమతో ఏకాంతంగా (సెక్స్) గడపాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. అలా చేయకుంటే పట్టణంలోకి అనుమతి లేదని బెదిరించారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ పేరు చెప్పి వారు ఈ తరహా ఆగడాలకు పాల్పడుతున్నారు. 
 
పల్నాడు జిల్లా నరసారావుపేట రూరల్ ఈ దారుణం జరిగింది. వారు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఏరియాలో ఉండాలంటే తమతో ఏకాంతంగా గడపాలని బెదిరిస్తున్నారని వాపోయారు. తామంతా ఆయా కార్యక్రమాలకు వెళ్లే సమయంలో వారు ప్రయాణిస్తున్న వాహనాలను పట్టణానికి చెందిన వైసీపీ నేత మచ్చ జానీ అతని అనుచరులు మరో ముగ్గురు కలిసి అడ్డుకుని వేధిస్తున్నట్టు పేర్కొన్నారు. 
 
తాము రౌడీ షీటర్లమని, తమకు ఎమ్మెల్యే గోపిరెడ్డి అండదండలు ఉన్నాయని బెదిరిస్తున్నారు. తమ ఇళ్లకు కూడా వచ్చి ఫోన్‌ నెంబర్లు ఇవ్వాలంటున్నారని, ఇవ్వకపోతే దాడి చేస్తున్నారని డ్యాన్సర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సంఘాలు తమకు అండగా ఉండాలని కోరారు. ఇదే విషయమై సోమవారం స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని డ్యాన్సర్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

తెలుగు ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా : నటి కస్తూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం