Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్కీ భర్తపై అనుమానంతో భార్య ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (09:01 IST)
టెక్కీ భర్తపై అనుమానంతో ఓ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఆత్మహత్య కేసు వివరాలను పరిశీలిస్తే... ఖమ్మం బూరాన్‌పూర్‌ ప్రాంతానికి చెందిన నీరుడు సుధాకర్‌ హైదరాబాద్ హైటెక్ సిటీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు అనూష  (27) అనే యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరంతా హైదరాబాద్ నగరానికి వచ్చి లంగర్‌హౌస్‌ జానకీనగర్‌లో నివసిస్తున్నాడు. అనూష కూడా బీటెక్‌ చదివింది. పిల్లలు చిన్నగా ఉండడంతో ఇంట్లోనే ఉంటోంది. 
 
భర్త సుధాకర్‌ అతని స్నేహితుడి చెల్లెలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు అనూష గుర్తించింది. ఆమె సెల్‌ఫోన్‌ రీచార్జి చేయించడంతో భార్యాభర్తల మధ్య ఘర్షణ మరింత పెరిగింది. గురువారం ఇద్దరూ గొడవపడ్డారు. భర్త తనను మోసం చేస్తున్నాడన్న అనుమానం ఆమెను పెనుభూతంగా మార్చింది. 
 
అతడు ఉద్యోగానికి వెళ్లగానే బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. విషయం తెలుసుకున్న సుధాకర్‌ వెంటనే ఇంటికి రాగా అప్పటికే భార్య మృతి చెందింది. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments