Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంతెవాడలో ఎన్‌కౌంటర్ - శాఖమూరి అప్పారావు భార్య మృతి!

ఠాగూర్
మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (10:15 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ - దంతెవాడ సరిహద్దుల్లో సోమవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళా మావోయిస్టు శాఖమూరి రేణుక అలియాస్ భాను అలియాస్ చైతే అలియాస్ సరస్వతి అలియాస్ దమయంతి ప్రాణాలు కోల్పోయింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దివంగత శాఖమూరి అప్పారావు భార్య. మావోయిస్టు పార్టీ దండకారాణ్య స్పెషల్ జోనల్ సభ్యురాలిగా రేణుక పనిచేశారు. 
 
కాగా, రేణుకపై తెలంగాణాలో రూ.20 లక్షలు, ఛత్తీస్‌గఢ్‌లో రూ.25 లక్షలు రివార్డులు ఉన్నాయి. బీజాపూర్, దంతెవాడ సరిహద్దుల్లోని ఇకేలీ బెలీనార్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందుకున్న బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పులు జరిగాయి. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ కాల్పుల్లో రేణుక ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలం నుంచి ఇన్సాస్ రైఫిల్, పేలుడు పదార్థాలు, ల్యాప్‌టాప్, ఇతర వస్తువులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments