Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు దూరమై.. పుట్టింటిలో వుంది.. ఇంతలో ఏమైంది.. పిల్లల గొంతుకోసి..?

Webdunia
మంగళవారం, 18 మే 2021 (12:21 IST)
భర్తకు దూరమై.. పుట్టింటిలో వున్న ఓ వివాహిత ఇద్దరు పిల్లలను గొంతుకోసి చంపేయడంతో పాటు ఆమెకు గొంతుకోసుకుంది. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోగా, ఆమె కూడా ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.
 
వివరాల్లోకి వెళితే.. పొదిలి మండలం ఉప్పలపాడుకు చెందిన గుంటూరి రంగయ్య, కోటేశ్వరమ్మల కూతురు ఆదిలక్ష్మికి ఐదేళ్ల క్రితం శింగరాయకొండకు చెందిన కరేటి శ్రీహరితో వివాహం జరిగింది. దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. 20 రోజుల క్రితం ఆదిలక్ష్మి పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. 
 
సోమవారం పుట్టింటిలోని వారంతా పొలం పనులకు వెళ్లగా ఆమె ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉంది. ఆ సమయంలో కత్తితో ఇద్దరు పిల్లల గొంతు కోసింది. ఆపై తన గొంతూ కోసుకుంది. ముగ్గురూ రక్తపు మడుగులో పడిపోగా.. పొలం నుంచి ఇంటికి వచ్చిన ఆదిలక్ష్మి సోదరుడు వెంకటరమణయ్య ఇరుగుపొరుగు సాయంతో ఆదిలక్ష్మి, ఆమె ఇద్దరు పిల్లలను ఒంగోలు రిమ్స్‌కు తరలించాడు.
 
అయితే ఒంగోలు చేరడానికి ముందే మార్గమధ్యలో పిల్లలిద్దరూ చనిపోయారు. కొన ఊపిరితో ఉన్న ఆదిలక్ష్మిని రిమ్స్‌లో చేర్పించాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments