Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంకకు వెళ్లడం వల్లే అతనికి దగ్గరయ్యావు : వివస్త్రను చేసి గొంతులో కత్తితో పొడిచి మహిళ హత్య

నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఓ వివాహిత నిండు ప్రాణం బలితీసింది. ఈ ఘటన హైదరాబాద్, కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... కేప

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (13:40 IST)
నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఓ వివాహిత నిండు ప్రాణం బలితీసింది. ఈ ఘటన హైదరాబాద్, కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... కేపీహెచ్‌బీ రోడ్డు నం.2కు చెందిన పారిశ్రామికవేత్త అంజి రెడ్డికి ప్రత్యూష (26) అనే మహిళతో వివాహమైంది. వీరికి ఓ నాలుగేళ్ల కుమార్తె ఉంది. అయితే, వ్యాపార రీత్యా గత యేడాది అంజిరెడ్డి శ్రీలంకకు వెళ్లారు. దీంతో ప్రత్యూష ఇంటిపక్కనే ఉండే శ్రీనివాస్ అనే వ్యక్తితో చనువు ఏర్పిడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
స్వదేశం నుంచి తిరిగివచ్చిన అంజిరెడ్డికి భార్య వ్యవహారం తెలిసింది. దీంతో భార్యను మందలించడమే కాకుండా, ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా ప్రత్యూషను కుటుంబ పెద్దలు హెచ్చరించినా.. ఆమోలో మార్పు రాలేదు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం అంజిరెడ్డి, ప్రత్యూష మధ్య ఘర్షణ తీవ్రస్థాయిలో జరిగినట్లు తెలిసింది. దీంతో ఆమె తన కుమార్తెను తీసుకుని కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో ఉండే శ్రీనివాస్‌ వద్దకు వచ్చింది. తాము భార్యాభర్తలమని ఇంటి యజమానిని నమ్మించి మూడు నెలలుగా అద్దె ఇంట్లో వారు కలిసి ఉంటున్నారు. 
 
ఈనేపథ్యంలో ఏప్రిల్ 22వ తేదీ రాత్రి శ్రీనివాస్‌ తన ఇంట్లోంచి బయటకు వెళ్లడాన్ని ఇరుగు పొరుగు గమనించారు. అప్పటి నుంచి అతను కనిపించలేదు. సోమవారం సాయంత్రం ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూడగా.. బెడ్‌రూంలో ప్రత్యూష మృతదేహం కనిపించింది.
 
ఆమెను వివస్త్రను చేసి శరీరంతో పాటు.. గొంతులో కత్తితో పొడిచినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. కాగా, శ్రీనివాస్‌ పరారీలో ఉండటాన్ని బట్టి అతనే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని కోసం గాలింపు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments