ప్రైవేట్ ఆస్పత్రిలో డెలివరీకి వచ్చి బాత్రూమ్‌లో ప్రసవం.. బిడ్డను బక్కెట్‌లో వదిలి...

ఠాగూర్
మంగళవారం, 23 సెప్టెంబరు 2025 (14:14 IST)
ఓ మహిళ ప్రైవేట్ ఆస్పత్రిలో డెలివరీ కోసం వచ్చి బాత్రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత బిడ్డను బాత్రూమ్ బక్కెట్‌లో వదిలిపెట్టి పోయింది. కొంత సేపటికి ఆ పసికందు ఏడుపు శబ్దాలు విని ఆస్పత్రి సిబ్బంది గుర్తించి, బిడ్డను రక్షించారు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వెలుగు చూసింది. 
 
ఓ గర్భిణీ మహిళ ప్రసవం కోసం నడుచుకుంటూ ఆస్పత్రిగా ఆస్పత్రికి వస్తున్న దృశ్యాలు సీసీటీవీలో కనిపిస్తున్నాయి. అయితే, ఆ మహిళ వైద్యులను సంప్రదించకుండా ఆస్పత్రి బాత్రూమ్‌కు వెళ్లి, అక్కడే ఓ శిశువును ప్రసవించింది. ఆ బిడ్డను బాత్రూమ్ బక్కెట్‌లో వదిలిపెట్టి వెళ్లిపోయింది. శిశువు ఏడుపు శబ్దం విన్న ఆస్పత్రి సిబ్బంది వెంటనే స్పందించారు. 
 
అయితే, ఆ సమయంలో ఆ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆ శిశువును మరో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా ఆ మహిళ మరో వ్యక్తితో కలిసి ఆస్పత్రికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments