Webdunia - Bharat's app for daily news and videos

Install App

గజ్వేల్‌లో దారుణం... మెడను వేరు చేసి.. గోనె సంచిలో మూటగట్టి...

తెలంగాణ రాష్ట్రంలోని గజ్వేల్‌లో దారుణం జరిగింది. ఓ మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కలు చేసి గోనె సంచిలో మూటగట్టి రోడ్డు పక్కన పడేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం అక్కారం గ్రామ

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2016 (13:29 IST)
తెలంగాణ రాష్ట్రంలోని గజ్వేల్‌లో దారుణం జరిగింది. ఓ మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కలు చేసి గోనె సంచిలో మూటగట్టి రోడ్డు పక్కన పడేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం అక్కారం గ్రామ శివార్లలో శనివారం ఉదయం కలకలం రేపింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... అక్కారం గ్రామంలోని తోట లక్ష్మారెడ్డి వ్యవసాయ పొలం పక్కన గల కాలువలో ఒక తెల్లని గోనె సంచిలో గుర్తుతెలియని యువతి మృతదేహం ఉందని గ్రామ సర్పంచ్ రాజుకు సమాచారం అందింది. దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. 22 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సున్న యువతి మృతదేహంగా గుర్తించారు. 
 
మెడ - మొండెం భాగాలను పూర్తిగా వేరు చేసి సంచిలో వేసి మూటకట్టి రోడ్డుపై పడేశారు. యువతి ఒంటిపై ఎర్రని ప్యాంట్‌ (పైజామా), ఎరుపు, నలుపు కలగలిపిన టాప్‌ (చుడిదార్‌) ఉంది. అమ్మాయి కొద్దిగా లావుగా ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో మెడ వరకు తలను వేరు చేసి మొండాన్ని సంచిలో వేసి పడేసినట్లు భావిస్తున్నారు. కాగా క్లూస్‌ టీమ్‌తో ఆధారాలను సేకరించామని, జాగిలా(డాగ్‌స్క్వాడ్‌)లతో తనిఖీ చేసినట్లు తెలిపారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments