Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా కండక్టర్‌ను హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు.. ఎవరు? ఎక్కడ?

ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళా కండక్టర్‌ను హత్య చేసి ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. తాజాగా జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఏపీఎస్ఆర్టీసీలో కల్యాణి అనే మహిళ కండక్టర్‌గా పనిచేస్తోంద

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (12:12 IST)
ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళా కండక్టర్‌ను హత్య చేసి ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. తాజాగా జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఏపీఎస్ఆర్టీసీలో కల్యాణి అనే మహిళ కండక్టర్‌గా పనిచేస్తోంది. రెండు రోజుల కిందట అదృశ్యమైన ఆమె.. ప్రాణాలు కోల్పోయి, సగం కాలిన స్థితిలో కనిపించింది.
 
ఈమె తన భర్త రాఘవయ్యతో కలిసి గంటూరు నగరంలోని సంపత్ నగర్‌లో నివశిస్తూ వచ్చింది. తన కనిపించడం లేదంటూ భర్త పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. ఇంతలో సోమవారం గుంటూరు శివారు బొంతపాడులో సగం కాలిపోయిన మహిళ శవాన్ని స్థానికులు గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ శవం కల్యాణిదేనని నిర్ధారించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 
కల్యాణిని భర్త రాఘవయ్యే చంపేసి ఉంటాడని ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. సంపత్‌ నగర్‌లోని ఇంట్లోనే రోకలి బండతోమోది కల్యాణిని చంపేసి, వాహనంలో శవాన్ని బొంతపాడుకు తీసుకొచ్చి తగులబెట్టి ఉంటారని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం రాఘవయ్యను విచారిస్తున్నామన్న పోలీసులు నిందితులను వదిలిపెట్టబోమని చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆపరేషన్ సిందూర్ ఆపలేదు.. కొనసాగుతుంది : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments