Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా మొగుడు అందగాడు, పడుకో తప్పేంటి? భర్తకు భార్య సపోర్ట్, ఎక్కడ?

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (16:07 IST)
సాధారణంగా భర్త తప్పు చేస్తుంటే భార్య తన దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. మరోసారి అలాంటిది చేయొద్దని ప్రాధేయపడుతుంది. అప్పటికీ చెడు మార్గాన వెళుతుంటే దండిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ భార్య పూర్తి విరుద్ధం. తప్పు చేస్తున్న భర్తకు సహకరించి చివరకు కటాకటాలపాలైంది. 
 
చిత్తూరు జిల్లా గాజులమండ్యంకు చెందిన ఫాస్టర్ దైవ సహాయం ఒక యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చర్చిలో ఉద్యోగం ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో బాధితురాలి తల్లి మీడియా ముందుకు వచ్చి జరిగిన అన్యాయాన్ని వివరించింది. 
 
నా కుమార్తె ఫాస్టర్ దైవ సహాయం వద్ద నెలరోజుల క్రితం పనిలో చేరింది. అకౌంటెంట్‌గా ఆమె పనిచేస్తోంది. పనిలో చేరిన వారం నుంచి దైవ సహాయం వేధిస్తున్నట్లు ఆమె చెప్పింది. ఈ విషయాన్ని ఫాస్టర్ భార్యకు కూడా చెప్పిందట. అయితే ఆమె నా భర్త అందంగా ఉంటాడు కదా పడుకో అందట. నాకు ఆమెతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అమ్మా అంటూ నా దగ్గర ఆవేదన వ్యక్తం చేసింది నా కూతురు.
 
ఇంత బాధపడుతూ అక్కడెందుకు వచ్చేయి అన్నాను. నెల రోజులు పనిచేసి జీతం తీసుకువస్తానని చెప్పింది. జీతంతో మన కష్టాలు తీరుతాయని కూడా చెప్పింది. కానీ ఇంతలో నా కూతురిపై ఆ ఫాస్టర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతడిని శిక్షించండి అంటూ బాధితురాలు తల్లి కన్నీటి పర్యంతమైంది. తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసి మీడియా ముందు ఉంచారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments