Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెల్త్ యూనివర్శిటీకి మళ్లీ ఎన్టీఆర్ పేరు పెడతాం : సీఎం రమేష్

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (17:49 IST)
విజయవాడలోని హెల్త్ యూనివర్శిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును వైకాపా ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో ఓ బిల్లును ఆమోదించింది. ఇది రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఎన్టీఆర్ పేరును తొలగించి ఆ స్థానంలో వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని ఎన్టీఆర్ అభిమానులతో పాటు తెదేపా, ఇతర రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఈ పేరు మార్పుపై బుధవారం స్పందించారు. వచ్చే 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభుత్వం మారితే మళ్లీ హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు పెడతామని తెలిపారు. తెలుగు ప్రజలు ఆరాధ్య దైవం ఎన్టీఆర్ పేరును తొలగించడం అత్యంత సిగ్గుచేటు, దారుణమని చెప్పారు. ఈ చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. 
 
వైకాపా ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందన్నారు. ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని సీఎం జగన్, మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు నిస్సగ్గుగా సమర్థించుకోవడం దారుణమన్నారు. దేశ, విదేశాల్లో తెలుగు వారికి ఓ గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అలాంటి మహనీయుడు పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు  ప్రతి ఒక్క తెలుగువాడిని తీవ్ర ఆవేదనకు లోనుచేస్తుందని తెలిపారు.
 
గత మూడున్నరేళ్ల వైకాపా పాలనలో ఒక్క రోడ్డు, భవనం, ప్రాజెక్టు కూడా నిర్మించలేదని, చివరకు రోడ్డుపై ఉన్న గుంతలు కూడా పూడ్చలేదని ఈ సర్కారు పాతవాటి పేర్లు మార్చుతూ పబ్బం గడుపుకుంటుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments