Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం.. రూ.2లక్షల డీల్.. భర్తను ప్రియుడితో కలిసి చంపించిన భార్య.. ఎక్కడ?

వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ భర్తను ప్రియుడి సహకారంతో హత్య చేయించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. 32 ఏళ్ల వయస్సు. ఇద్దరు పిల్లలున్నా.. భర్తను కాదని 22 ఏళ్ల యువకు

Webdunia
శనివారం, 17 జూన్ 2017 (17:55 IST)
వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ భర్తను ప్రియుడి సహకారంతో హత్య చేయించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. 32 ఏళ్ల వయస్సు. ఇద్దరు పిల్లలున్నా.. భర్తను కాదని 22 ఏళ్ల యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. అడ్డుగా ఉన్న భర్తను దారుణంగా చంపించింది. వివరాల్లోకి వెళితే..  పాల్వంచ మండలం సోములగూడెంలో సపావట్‌ శ్యామ్‌ (43) అనే వ్య‌క్తి కిన్నెరసాని ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ప‌నిచేస్తున్నాడు. ఇతనికి 13 సంవత్సరాల అంజనాపురం గ్రామానికి చెందిన శారదతో వివాహమైంది. 
 
ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు వున్నారు. భార్యాపిల్లలు సోములగూడెంలో ఉంటుండ‌గా శ్యామ్ త‌న ఉద్యోగం నిమిత్తం కిన్నెరసాని ఆశ్ర‌మ పాఠ‌శాల స‌మీపంలో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో సోమిశెట్టి సాయికృష్ణ (22)తో శారదకు వివాహేతర సంబంధం ఏర్పడింది. 
 
వేసవి సెలవులు రావడంతో పాఠశాల నుంచి శ్యామ్ తన భార్యాపిల్లల వద్దకు వచ్చాడు. దీంతో తన ప్రియుడిని కలుసుకోలేకపోయిన శారద.. భర్తతో తరచూ గొడవకు దిగేది. అంతేకాకుండా భర్తను చంపించేయాలని ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. భర్తను హత్య చేసిన వారికి రెండు లక్షల రూపాయలు ఇస్తానని డీల్ కుదుర్చుకుంది. ఆపై భర్తను బంధువుల ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ ఓ ఇంట్లోకి తీసుకెళ్లి ప్లాన్ ప్రకారం ప్రియుడితో పాటు మరో నలుగురితో కలిసి భర్త గొంతుకు చున్నీ బిగించి హతమార్చేలా చేసింది. 
 
ఆపై అతని మృతదేహాన్ని గోనెసంచిలో వేసి లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు వద్ద రైల్వే బ్రిడ్జి సమీపంలో పడేశారు. ఆపై భర్త కనబడటం లేదని డ్రామాలాడింది. ఈ కేసుపై దర్యాపు చేసిన పోలీసులు నిందితురాలు శారద అని కనిపెట్టారు. శారదతో పాటు ఆమె ప్రియుడు సోమిశెట్టి సాయికృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హ‌త్య చేయ‌డంలో వారికి స‌హ‌క‌రించిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments