Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో రొమాన్స్‌కు అడ్డొస్తున్నాడనీ భర్తను చంపి భార్య - సహకరించిన కుమారుడు

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో మరో వివాహేతర హత్య జరిగింది. ఇటీవల ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను చంపేసి.. ఆ తర్వాత ప్రియుడికి ప్లాస్టిక్ సర్జరీ చేసి భర్త స్థానంలో తీసుకొచ్చేందుకు ఓ మహి

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (16:43 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో మరో వివాహేతర హత్య జరిగింది. ఇటీవల ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను చంపేసి.. ఆ తర్వాత ప్రియుడికి ప్లాస్టిక్ సర్జరీ చేసి భర్త స్థానంలో తీసుకొచ్చేందుకు ఓ మహిళ చేసిన ప్రయత్నం విఫలమై జైలు ఊచలు లెక్కిస్తున్న విషయతెల్సిందే. ఇపుడు తాజాగా తన ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను భార్య చంపేసింది. ఇందుకోసం కుమారుడు సహకరించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
కల్వకుర్తి పట్టణం హనుమాన్ నగర్ కాలనీకి చెందిన కావలి మల్లయ్య(45), పార్వతమ్మ అనే దంపతులు ఉన్నారు. వీరికి శ్రీకాంత్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, పార్వతమ్మకు అదేప్రాంతానికి చెందిన రాములు అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరి అక్రమ సంబంధానికి భర్త మల్లయ్య అడ్డుతగులడమే కాకుండా, వారిద్దరినీ హెచ్చరిస్తూ వచ్చాడు. 
 
దీంతో ప్రియుడు రాములు, కుమారుడు శ్రీకాంత్‌లతో కలిసి భర్త మల్లయ్యను భార్య పార్వతమ్మ మట్టుబెట్టింది. ఆతర్వాత శవాన్ని ముక్కలు ముక్కలుగా గోనె సంచల్లో కట్టి నాగనూల్ చెరువులో పడేశారు. తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... విచారణ చేపట్టిగా అసలు విషయం వెల్లడైంది. దీంతో పార్వతమ్మను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం కక్కింది. దీంతో పార్వతమ్మ, ప్రియుడు రాములు, కొడుకు శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments