రానున్న 24 గంటల్లో కోస్తాలో విస్తారంగా వర్షాలు

Webdunia
బుధవారం, 15 జులై 2020 (09:10 IST)
రానున్న 24 గంటల్లో కోస్తాలో విస్తారంగా, అక్కడక్కడా భారీ వర్షాలు, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 
 
వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీనికితోడు పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగడంతో వాతావరణంలో అనిశ్చితి నెలకొంది. 
 
ఈ ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారి కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములతో వర్షాలు కురిశాయి. 
 
తిరువూరులో 170, విశాఖపట్నంలో 100, చోడవరంలో 80, ఉండ్రాజవరం 79, అనకాపల్లి, ఎలమంచిలిలో 60, పెనుగంచిప్రోలు 54 అవనిగడ్డ 50, పెనమలూరులో 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో  భారీ వర్షాలతో 7,010 హెక్టార్లలో వరి పంట ముంపునకు గురైందని అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లాలోనూ పలు మండలాల్లో వేలాది ఎకరాల పంట భూములు ముంపునకు గురయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments