Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టర్ల తెల్లకోటుతోనే అనేక వ్యాధుల వ్యాప్తి... నిజమా?

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2015 (16:58 IST)
వైద్యులు ధరించే తెల్లకోటుల వల్ల వ్యాధులు వ్యాపిస్తున్నట్టు తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. బెంగళూరులోని యెనెపోయా మెడికల్ కళాశాలలో పీహెచ్‌డీ చేస్తున్న ఎడ్మండ్ ఫెర్నాండెజ్ అనే రీసెర్చ్ స్కాలర్ చేసిన పరిశోధనలో ఈ విషయం తెలిసింది. ఇతని అధ్యయనం ప్రకారం... వైద్యులు ధరించే తెల్లకోటు వల్ల అనేక వ్యాధులు వ్యాపిస్తాయని, వాటిని ధరించడం నిషేధిస్తే చాలావరకు రోగాలు తగ్గుతాయని తేలింది.
 
సాధారణంగా అనాదిగా వైద్యులు, నర్సులు, మెడికల్ విద్యార్థులు పొడుగుచేతుల తెల్లకోటును ధరిస్తుంటారు. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముందని తేలింది. తెల్లకోటుపై వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోవడం, సూక్ష్మాతి సూక్ష్మమైన క్రిములు, బ్యాక్టీరియా చేరడం వల్ల ఇన్ఫెక్షన్ సోకుతుందన్నారు. 
 
వార్డుల్లో రోగులను పరిశీలించిన తర్వాత వైద్యులు లేదా డాక్టర్లు నేరుగా స్టెరిలైజ్డ్ గదుల్లోకి, ఆపరేషన్ థియేటర్‌లలోకి వెళుతుంటారు. దీంతో బ్యాక్టీరియా మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని, తద్వారా వ్యాధులు మరింతగా వ్యాపించే అవకాశం ఉందని చెపుతున్నారు. 
 
దీంతో బ్రిటన్‌లో 2007లోనే ఈ తెల్లకోటును నిషేధించగా, అమెరికాలో సైతం 2009లో ఈ విషయంపై చర్చలు జరగగా, దానిపై ఇప్పటికీ వాదనలు జరుగుతున్నాయి. మన దేశంతో పాటు అనేక దేశాల్లో మాత్రం ఈ పొడవాటి చేతుల తెల్లకోటులు ధరించే అలవాటు వాడుకలో ఉంది. 

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments