Webdunia - Bharat's app for daily news and videos

Install App

పునర్జన్మ ఇచ్చిన ఉగాది అంటే ఎంతో ఇష్టం అన్న ఆ పెద్దాయన: ఎవరు?

తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు పలికిన రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ తెలుగు నేలతో తనకున్న అనుబంధాన్ని తల్చుకుని భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు నేలతో తనకు విడదీయరాని అనుబంధం ఉన్నదని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Webdunia
బుధవారం, 29 మార్చి 2017 (08:23 IST)
తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు పలికిన రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ తెలుగు నేలతో తనకున్న అనుబంధాన్ని తల్చుకుని భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు నేలతో తనకు విడదీయరాని అనుబంధం ఉన్నదని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పైగా తెలుగు నేల తనకు మరు జన్మను ప్రసాదించిందని కూడా చెప్పారు.
 
హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో మం‍గళవారం రాత్రి ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించిన సందర్భంగా గవర్నర్ హేవళంబి సంవత్సరం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల  ప్రజలకు సుఖసంతోషాలు ఇవ్వాలని, రెండు రాష్టాలూ సమృద్ధిని సాధించాలని కోరుకున్నారు. రాజ్ భవన్‌లో తన ముందు రెండు రాష్టాలు ఉన్నాయని, ఇలాగే కలిసి మెలిసి ఉండాలని కోరుకున్న గవర్నర్ తనకు తెలుగు రాష్ట్లాలు అంటే ఎందుకు అంత ఇష్టమో చెబుతూ పాత జ్ఞాపకాలు పంచుకున్నారు.
 
గవర్నర్ చెప్పిన మాటల బట్టి ఆయన చదువు తెలుగునేలపైనే మొదలైంద. ఆయన మొదటి ఉద్యోగం కూడా తెలుగు గడ్డపైనే ప్రారంభమైంది. పైగా నలభై ఆరేళ్ల కిందట కర్నూలు జిల్లాలో జరిగిన ఒక దుర్ఘటనలో ఆయన రెండు రోజులపాటు కోమాలోకి వెళ్లి బతికిబయట పడ్డారు. తెలుగు నేల తనకు పునర్జన్మ ఇచ్చిందని చెప్పిన గవర్నర్ అదికూడా ఉగాది రోజే జరిగిందని, అందుకే ఉగాది అంటే తమ కుటుంబానికి ప్రత్యేకమని చెప్పారు. 
 
కాగా, ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి తెలంగాణ సీఎల్పీ నేత కె.జానారెడ్డి, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.
 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments