Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుస్తెలమ్మైనా పులస తినాలన్నది నానుడి.. రూ.వేలు పలికిన గోదారి పులస! (video)

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (10:45 IST)
పుస్తెలమ్మైనా పులస తినాలన్న నానుడి వాడుకలో ఉంది. ముఖ్యంగా గోదారి పులసకు ఉండే ప్రత్యేకత ఇంతాఇంతా కాదు. అంటే.. గోదారి పులస రుచి అలాంటిది మరి. అయితే, ఈ పులస రుచిలాగానే ధర కూడా ఉంటుంది. పులసలకు పెట్టింది పేరు... తూర్పు'గోదావరే'! 
 
జూలై - సెప్టెంబరు నెలల మధ్య వర్షాకాలంలో.. 'ఇలస' చేప.. గోదావరి జలాల్లో ఎదురీదుతూ.. 'పులస'గా మారుతుందని చెబుతారు. మత్స్యకారుల వలకు చాలా అరుదుగా పడతాయి. కిలో రూ.4 వేల వరకు ఉంటుంది. దేశంలోనే ఖరీదైన చేప అంటారు. దీని రుచి గురించి తెలిసినవారు.. ధర గురించి ఏమాత్రం ఆలోచించరు.
 
తాజాగా.. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి వద్ద గోదావరి నదిలో ఆదివారం స్థానిక మత్స్యకారుడి వలలో రెండున్నర కిలోల పులస చేప పడింది. పాశర్లపూడిలో నగరం ఏఎంసీ ఛైర్మన్‌ కొమ్ముల కొండలరావు ఈ చేపను రూ.21 వేలుకు కొనుగోలు చేయడం విశేషం. 
 
పులస సాధారణంగా 3 కిలోలకు మించి బరువుండదు. ఎక్కువగా అరకిలో, కిలో లోపు చేపలే దొరుకుతాయి. కానీ ఈ పులస ఏకంగా రెండున్నర కిలోలు ఉండటంతో ధర కూడా ఓ రేంజ్‌లోనే పలికిందన్నమాట. అద్గదీ గోదారి పులస కథ. 

 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments