Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి నో చెప్పాడనీ ప్రియుడిని కత్తితో వెన్నులో పొడిచిన ప్రియురాలు...

Webdunia
మంగళవారం, 12 జనవరి 2021 (09:13 IST)
రెండేళ్ళపాటు ప్రేమించి, తీరా పెళ్లి మాటెత్తగానే నో చెప్పిన ప్రియుడుని ప్రియురాలు కత్తితో పొడిచి చంపేసింది. ఈ ఘటన వెస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... తాళ్లపూడి మండలంలోని మలకపల్లికి చెందిన గర్సికూటి పావని, తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన అంబటి తాతాజీనాయుడు (25) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
 
పెళ్లి చేసుకుందామంటూ పావని ఏడాదిగా అడుగుతున్నా తాతాజీ నిరాకరిస్తున్నాడు. నిన్న మధ్యాహ్నం తాతాజీ బైక్‌పై పంగిడి వచ్చాడు. అక్కడ పావని అతడిని కలిసింది. రాత్రి వరకు ఇద్దరూ అక్కడే తిరిగిన అనంతరం బైక్‌పై మలకపల్లి బయలుదేరారు.
 
ఈ క్రమంలో వెనక కూర్చున్న పావని సంచిలో వెంట తెచ్చుకున్న కత్తి తీసి తాతాజీని వెనక నుంచి పొడిచింది. బాధతో కిందపడి విలవిల్లాడుతున్న తాతాజీ మెడ, తల, వీపుపైనా కత్తితో దాడిచేసింది. 
 
ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన తాతాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ వాయిదాకు కారణం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

తర్వాతి కథనం
Show comments