బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీతో సహా ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

ఠాగూర్
మంగళవారం, 26 నవంబరు 2024 (08:44 IST)
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారనుంది. ఇది ప్రస్తుతం తూర్పు హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమైవుంది. ఇది వచ్చే 24 గంటల్లో వాయవ్య దిశగా పయనించి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది. ఆ తర్వాత 48 గంటల్లో ఇది తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనించే అవకాశం ఉందని తెలిపింది.
 
దీని ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో ఈ నెల 29 వరకు కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎన్డీఎంఏ) వెల్లడించింది. దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
 
వాయుగుండం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి రేపు, ఎల్లుండి 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ఏపీఎస్జీఎంఏ వివరించింది.
 
ఇక, రేపు, ఎల్లుండి (ఈ నెల 26, 27 తేదీల్లో) నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 28న దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీఎస్జీఎంఏ తన బులెటిన్ లో పేర్కొంది.
 
నవంబరు 29న గుంటూరు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు... విశాఖ, అనకాపల్లి, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో కొన్ని - చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments