Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జ‌గ‌న్ ఇంటి ముందే ఉద్య‌మిస్తాం: జ‌న‌సేన ప‌వ‌న్

Webdunia
బుధవారం, 7 జులై 2021 (16:52 IST)
సిఎం జ‌గ‌న్ భద్రత పేరుతో ఇళ్లను ఖాళీ‌ చేయిస్తారా? ఆడపడుచులను పచ్చి బూతులు తిడతారా? 
ఇటువంటి నాయకులు ఉంటే..‌మానభంగాలు ఎలా ఆగుతాయి? సిఎం ఇంటి‌చుట్టూ ఉన్న‌వారికే రక్షణ లేదు... అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

సీఎం నివాసం తాడేప‌ల్లిలో 35 ఏళ్లుగా ఉన్నవారికి పునరావాసం కల్పించాల‌ని, భయపెట్టి.. బెదిరిద్దాం అనుకుంటే ప్రజలు భయపడర‌ని, ఖాళీ చేయించడం తప్పనిసరైతే, వారికి ముందు న్యాయం చేయాలి... 350 కుటుంబాలకు ఇళ్లు ఇచ్చాకే వారిని తొలగించాల‌న్నారు. కాద‌ని, మొండిగా ముందుకెళితే... జనసేన తరపున సిఎం నివాసం వద్దే ఉద్యమిస్తాం అని ప‌వ‌న్ క‌ల్యాణ్ హెచ్చ‌రించారు. 
 
జ‌న‌సేన కార్యాల‌యంలో పవన్ కళ్యాణ్‌ను తాడేపల్లి అమరరెడ్డి కాలనీవాసులు క‌లిసి, త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ‌నివాసం‌ చుట్టూ ఉన్నవారికి ఖాళీ‌ చేయాలని నోటీసులు ఇచ్చారు. తొలుత వేరే స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా ఖాళీ‌ చేయాలని బెదిరిస్తున్నార‌ని, అర్ధరాత్రి ప్రొక్లెయిన్ లను ఇళ్ల మీదకు పంపిస్తున్నార‌ని, అదేమని అడిగితే చెప్పలేని విధంగా బూతులు తిట్టి‌ బెదిరిస్తున్నార‌ని బాధితులు ఆరోపించారు. ముప్పై ఏళ్లుగా ఉంటున్న మాకు గూడు లేకుండా చేస్తున్నార‌ని, ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ‌కు అండగా నిలబడి ఉద్యమం చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments