Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ లైవ్‌షోలో బూతులు తిడుతూ వీహెచ్‌పై లంఘించిన పోసాని కృష్ణమురళి

సినీ నటుడు పోసాని కృష్ణమురళి సహనం కోల్పోయారు. అదీ కూడా టీవీ లైవ్‌షోలో. అంతటితో ఊరుకోలేక తనతో వాగ్వాదానికి దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుపైకి ఒక్క ఊపున లంఘించాడు. ఈ వివరాలను పరిశీలిస్తే సాధా

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (12:58 IST)
సినీ నటుడు పోసాని కృష్ణమురళి సహనం కోల్పోయారు. అదీ కూడా టీవీ లైవ్‌షోలో. అంతటితో ఊరుకోలేక తనతో వాగ్వాదానికి దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుపైకి ఒక్క ఊపున లంఘించాడు. ఈ వివరాలను పరిశీలిస్తే సాధారణంగా పోసాని కృష్ణమురళికి ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం. అయితే, ఆవేశం వస్తే మాత్రం ఏ విషయాన్ని ఆపుకోలేరు. పైగా మనసులో దాచుకోలేరు కూడా. 
 
ఈపరిస్థితుల్లో ప్రముఖ టీవీ చానెల్ ఒకటి భారత ఆర్మీ ఇటీవల జరిపిన సర్జికల్ దాడులపై లైవ్ చర్చా కార్యక్రమం చేపట్టింది. ఇందులో పోసానితో పాటు వీహెచ్ కూడా పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని పోసాని పొగుడుతుంటే, కాంగ్రెస్ నేత అయిన వీహెచ్ అడ్డుకున్నారు. దీంతో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. 
 
తాను మోడీకి అభిమానినని ఆయన గురించి మాట్లాడే తీరుతానని పోసాని అనడంతో, వీహెచ్ కల్పించుకుని అలాగైతే బయటకు వెళ్లి మాట్లాడాలని గదమాయించారు. దీంతో అప్పటికే బీపీ పెంచుకుని మాట్లాడుతున్న పోసాని, ఆపుకోలేక తన కుర్చీలోంచి లేచి బూతులు తిడుతూ వీహెచ్ పైకి లంఘించాడు. ఆ సమయంలో లైవ్ షోను కట్ చేశారు. ఈ వీడియోను మీరూ చూడవచ్చు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం