Webdunia - Bharat's app for daily news and videos

Install App

డౌట్స్ పేరుతో విద్యార్థినిల ట్రాప్ చేసిన టీచర్.. అశ్లీల ఫోటోలతో వేధింపులు...

Webdunia
సోమవారం, 8 జులై 2019 (11:32 IST)
సందేహాలను నివృత్తి చేస్తానంటూ విద్యార్థినులను ఓ ఉపాధ్యాయుడు ట్రాప్ చేశాడు. ఆ తర్వాత వారి ఫోన్ నంబర్లు తీసుకుని వారికి అసభ్యకర మేసేజ్‌లు, అశ్లీల ఫోటోలు పంపుతూ వేధించసాగాడు. వీటిని భరించలేని ఓ యువతి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లా హన్మకొండలోని ఓ ప్రైవేటు కాలేజీలో ములుగు జిల్లా ఇంచర్ల గ్రామానికి చెందిన తొంబురపు రంజిత్‌ కుమార్‌ అనే వ్యక్తి ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. ఆయన చదువులో వెనుకబడివున్న విద్యార్థినిలను గుర్తించి, ఏదేని సందేహాలు ఉంటే తనకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలంటూ వారికి తన ఫోన్ నంబరు ఇచ్చేవాడు. ఆ తర్వాత మెల్లగా వారిని తనదారిలోకి తీసుకుని వారి ఫోన్ నంబర్లను తీసుకునేవాడు. 
 
ఆ తర్వాత అసభ్యకర సందేశాలు, అశ్లీల ఫోటోలు పంపుతూ వారిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధిత విద్యార్థినుల్లో ఒకరు విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తేవడంతో వారు కమిషనరేట్‌ వాట్సాప్‌ నంబర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్‌ రవీందర్‌ ఆదేశాల మేరకు షీ బృందం రంగంలోకి దిగి ఆ ఉపాధ్యాయుడి బాగోతాన్ని బయటపెట్టారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments