Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వైన్‌ ఫ్లూ వైరస్‌కు వరంగల్ ఏసీపీ మృతి

వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వర్ధన్నపేట పోలీస్‌ డివిజన్‌ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న దుర్గయ్య యాదవ్‌ (51) ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో మృతి చెందారు. వారం రోజుల కిందట వర్ధన్నపేట క్వార్టర్స్‌లో ఉన్న

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (08:51 IST)
వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వర్ధన్నపేట పోలీస్‌ డివిజన్‌ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న దుర్గయ్య యాదవ్‌ (51) ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో మృతి చెందారు. వారం రోజుల కిందట వర్ధన్నపేట క్వార్టర్స్‌లో ఉన్న సమయంలో తీవ్ర జ్వరం రావడంతో హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి పంపించారు. వైద్యులు స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయని చికిత్స చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు. ఈ మృతితో ఈ యేడాది ఇప్పటివరకు స్వైన్ ఫ్లూకు మరణించిన వారి సంఖ్య 17కు చేరింది. 
 
మరోవైపు... రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. ఈ యేడాది ఇప్పటి వరకూ 1750 మందికి ఈ మహమ్మారి సోకినట్లుగా నిర్ధారించగా వీరిలో 44 మంది మృత్యువాతపడ్డారు. ముఖ్యంగా రోగులపై స్వైన్‌ఫ్లూ పడగ విప్పుతోంది. మృతుల్లో 91 శాతం మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారే కావడం గమనార్హం. 
 
ఈ వైరస్ ఎక్కువగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో, మధుమేహులు, గర్భిణులు, ఐదేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, సీఓపీడీ, క్యాన్సర్‌, ఆస్తమా రోగుల్లో, కిడ్నీ, కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నవారు, దీర్ఘకాలంగా స్టెరాయిడ్లు తీసుకుంటున్నవారికి ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments