Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక ఓటర్ ఐడీకి ఆధార్ లింక్! ప్ర‌తిప‌క్షాలు వ్య‌తిరేకించినా బిల్లు

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (17:02 IST)
ఎన్నికల సంస్కరణలో భాగంగా ఓటరు ఐడీ కార్డులకు ఆధార్ ను అనుసందానం చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు-2021 సోమవారం లోక్ సభలో ఆమోదం పొందింది.

 
ఓట‌రు ఐడీకి ఆధార్ లింక్ చేయ‌వ‌ద్ద‌ని ప్రతిపక్ష ఎంపీలు చేస్తున్న‌నిరసనల మధ్యే, మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు సభాపతి ప్రకటన చేశారు. ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానంతోపాటు ఇకపై  ఏటా నాలుగు సార్లు ఓటరు నమోదు, మహిళా సర్వీస్ అధికారిణిల భర్తలకూ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం, ఎన్నికల కమిషన్ పరిధిని విస్తృతం చేసే కీలక అంశాలు బిల్లులో ఉన్నాయి. 
 
 
మిగతా మూడు అంశాలపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకున్నా, ఓటరు జాబితాకు ఆధార్ అనుసంధానాన్ని మాత్రం ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. దీని వ‌ల్ల ఓట‌రు అస్తిత్వానికి, గోప్య‌త‌కు ముప్పు క‌లుగుతుంద‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ తో C-మంతం గ్లింప్స్‌

శివ కందుకూరి, రాజీవ్ కనకాల చాయ్ వాలా ఫస్ట్ లుక్

సత్యదేవ్, ఆనంది కాంబినేషన్ లో వచ్చిన అరేబియా కడలి రివ్యూ

అపరిచితులుగా కలిసిన ప్రేమికులుగా మారిన కాన్సెప్ట్ తో కపుల్ ఫ్రెండ్లీ

సూపర్ స్టార్ తెలుగు సినిమాకు గర్వకారణం అంటు దీవెనలు ఇచ్చిన మెగాస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments