Webdunia - Bharat's app for daily news and videos

Install App

వోల్వో బస్సు బోల్తా; ఏడుగురికి తీవ్రగాయాలు

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (10:26 IST)
పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలంలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. కాకినాడ నుంచి శనివారం ఉదయం హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపోలు గ్రామ సమీపంలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా కొట్టింది. 
 
ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో మాజీ ఎమ్మెల్యే రామారావు కూడా వున్నారు. డ్రైవర్, క్లీనర్‌తో కలిపి పన్నెండు మందితో హైదరాబాద్ వస్తున్న వోల్వో కొండ్రపోలు దగ్గరకు రాగానే లారీని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 
 
గత వారంలో పాలెంలో ఒక వోల్వో బస్సు బోల్తా పడిన సంగతి తెలిసిందే. కాగా ఓల్వో బస్సుల డిజైన్‌లోనే లోపం వుందని విమర్శలు వచ్చినప్పటికీ, ఓల్వో సంస్థ మాత్రం తాము రూపొందించే బస్సులు భేషుగ్గా వున్నాయని తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకుంది.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments