Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడాలి నాని ఓటమిని జీర్ణించుకోలేక వాలంటీర్ ఆత్మహత్య

సెల్వి
బుధవారం, 5 జూన్ 2024 (10:30 IST)
ఏపీలో ఎన్డీయే కూటమి చేతిలో ఘోర పరాజయాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు, మద్దతుదారులు అంగీకరించారు. వైకాపా పార్టీ తరపున పోటీలో ఓడిపోయిన వారందరిలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా వున్నారు. 
 
50000 ఓట్ల తేడాతో టీడీపీ నాయకుడు వెలిగండ్ల రాము చేతిలో చిత్తుగా ఓడిపోయారు. నాని ఫైర్‌బ్రాండ్ లీడర్‌గా తరచూ టీడీపీ నేతలను దూకుడుగా తిట్టేవారు.
 
ఊహించని రీతిలో ఘోర పరాజయం పాలవ్వడంతో ఆ పార్టీ కేడర్‌ ఉలిక్కిపడింది. తాజాగా కొడాలినాని ఓటమిని భరించలేక ఓ వాలంటీర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
కొడాలి నాని ఓటమి వార్తను జీర్ణించుకోలేక పిట్ట అనిల్ అనే వాలంటీర్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అనిల్ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వాలంటీర్‌గా పనిచేశాడు. ఇతను గుడివాడ రూరల్ సెగ్మెంట్‌లోని సైదేపూడి గ్రామానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వయసుతో సమంబంధం లేదు - ప్రతి ఒక్కరూ బానిసలవుతున్నారు : ఐశ్వర్య రాయ్

Faria Abdullah: సరికొత్త డార్క్ కామెడీ థ్రిల్లర్ మూవీ గుర్రం పాపిరెడ్డి సాంగ్

'గ్రాజియా ఇండియా' కవర్ పేజీపై సమంత!

Anupama: ప్రతి ఒక్కరి పరదా వెనుక మరో వ్యక్తి వుంటాడు : నిర్మాత విజయ్ డొంకడ

బావ బాగానే సంపాదించారు.. కానీ, మమ్మల్ని కొందరు మోసం చేశారు... డిస్కోశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments