Webdunia - Bharat's app for daily news and videos

Install App

లావుగా ఉండే మహిళలు, యువతులే టార్గెట్.. కారు డ్రైవర్ ఘరానా మోసం

Webdunia
ఆదివారం, 17 నవంబరు 2019 (10:57 IST)
విశాఖపట్టణం నగరంలో ఓ కారు డ్రైవర్ ఘరానా మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. పలువురు మహిళలు, అమ్మాయిలను మోసం చేసినట్టు వెల్లడైంది. ముఖ్యంగా, లావుగా ఉన్న మహిళలు, యువతులను టార్గెట్ చేసి, వారివద్ద లక్షలాది రూపాయలు గుంజుకున్నట్టు తేలింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖ నగరంలో కంచరపాలెం ప్రాంతానికి చెందిన అజిత్ కుమార్ అనే వ్యక్తి కారు డ్రైవర్‌గా ఉన్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, తాను విశాఖలో పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యుడునంటూ, తన వద్ద ఉన్న ఫేక్ ఐడీ కార్డులతో మహిళలు, యువతులు పరిచయం చేసుకుంటాడు. 
 
ఉదయం పూట బీచ్ రోడ్డు ప్రాంతంలో నడిచే వాకర్స్‌ను టార్గెట్ చేస్తూ పరిచయం పెంచుకుంటాడు. లావుగా ఉన్నారని, డైట్ అవసరమని చెప్పి తన ఫోన్ నెంబర్ ఇస్తాడు. అలా పరిచయం అయిన వాళ్ళతో ఫేస్‌బుక్ ద్వారా కనెక్ట్ అవుతాడు. 
 
వారితో సాన్నిహిత్యం పెంచుకుని శారీరకంగా లోబర్చుకుని వీడియోలు చిత్రీకరించేవాడు. ఆ వీడియోలతో బెదిరించి డబ్బు, నగలు అందినకాడికి దోచుకునేవాడు. అలా అజిత్ కుమార్ చేతిలో మోసపోయిన ఓ మహిళ స్పందన కార్యక్రమం ద్వారా పోలీసులను ఆశ్రయించడంతో అతడి బండారం బయటపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments