Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిపిఎం, సిపిఐ పార్టీలకు సిగ్గులేదు: విష్ణువర్ధన్ రెడ్డి కామెంట్

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (22:17 IST)
సిపిఎం, సిపిఐ పార్టీలకు సిగ్గులేద‌ని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి కామెంట్ చేశారు. జ‌ల వివాదంలో ప్ర‌ధాని మోడీ జోక్యం చేసుకోవాలన్న ఆ పార్టీల నేతలు... ఇప్పుడు జోక్యం చేసుకుంటే తెలంగాణాకు అనుకూలంగా మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శిస్తున్నార‌ని అన్నారు.

విజ‌య‌వాడ‌లోని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, క‌మ్యూనిస్టుల‌కు నీతి, ఒక‌ అజెండా లేద‌న్నారు. సిపిఎం, సిపిఐ తెలంగాణాకు వ్యతిరేకమా? ఎపికి అనుకూలమా ప్రజలకు చెప్పాల‌న్నారు. సిపిఐ, సిపిఎం టిఆర్ ఎస్ పార్టీకి తొత్తుల‌ని విమ‌ర్శించారు. 
 
ఏపీలో 26 నెలల్లో ఒక్క కొత్త ఇల్లు కట్టని వైసీపీ ప్రభుత్వం, 2022 క‌ల్లా 30 లక్షల ఇళ్లు నిర్మిస్తామ‌ని చెపుతోంద‌ని విష్ణు వర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిర్మాణం పూర్తి అయిన ఇళ్ళు లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పగల‌రా? అని ప్ర‌శ్నించారు. కంట్రాక్టర్ల కు బిల్లులు ఇవ్వలేకనే పేదల ఇళ్ళ బదలాయించడం లేద‌న్నారు.

అర్బన్ హౌసింగ్ అవినీతిపై ఈ ప్రభుత్వం విచారణ ఎందుకు జరపలేద‌ని? అన్నింటిలో విచారణ అంటున్న వైసీపీ హౌసింగ్ పై ఎందుకు వెనక్కి తగ్గుతుంద‌ని ప్ర‌శ్నించారు. గ‌త మంత్రి నారాయణ తో వైసీపీ ప్రభుత్వం అంతా సెట్ చేసుకుందా? అని అనుమానం వ్య‌క్తం చేశారు. మంత్రి కొడాలి నాని ధాన్యానికి సంబంధించి కేంద్రం నిధులివ్వలేద‌ని అంటున్నార‌ని,  మరి ఇళ్లకు ఇచ్చిన డబ్బులు ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు. మంత్రులే మిల్లుల‌ను నడుపుతున్నారు కాబట్టి ధాన్యం డబ్బులు వేయడం లేదని అనిపిస్తోంద‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments