చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది.. 2019లో జగనే సీఎం: విష్ణుకుమార్ జోస్యం

ఏపీ సీఎం చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని.. రానున్న రోజుల్లో అదీ కాస్త పూర్తిగా పడిపోతుందని.. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు..

Webdunia
గురువారం, 3 మే 2018 (15:54 IST)
ఏపీ సీఎం చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని.. రానున్న రోజుల్లో అదీ కాస్త పూర్తిగా పడిపోతుందని.. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు.. హైదరాబాదులో వుంటే ఇబ్బందులు వస్తాయని భావించారన్నారు.


అందుకే అక్కడి నుంచి పారిపోయి., విజయవాడకు మకారం మార్చారని విష్ణు సెటైర్లు విసిరారు. అంతేగాకుండా.. 2019 ఎన్నికల్లో వైకాపా విజయం సాధిస్తుందని.. వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని విష్ణు జోస్యం చెప్పారు. 
 
గురువారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం విష్ణుకుమార్ రాజు మీడియా మాట్లాడుతూ.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని తెలుగు వారు బీజేపీకి ఓటు వేయొద్దని చంద్రబాబు పిలుపు ఇవ్వడం ఏమిటని మండిపడ్డారు.

చంద్రబాబు పిలుపుతో కర్ణాటకలో ఉన్న తెలుగువారు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వుందని తెలిపారు. టీడీపీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విష్ణు ఆరోపణలు చేశారు. టీడీపీ అవినీతిని త్వరలోనే బహిర్గతం చేస్తామని విష్ణు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments