టాప్ టెన్ రిచెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా, విశాఖకు స్థానం

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (13:45 IST)
సుందర సాగర తీరం, సహజ వనరులు, ప్రకృతి అందాలు ఇది విశాఖకు ముఖచిత్రం. అంతేకాకుండా పర్యాటకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో వున్న నగరం రాష్ట్రానికి ఆర్థిక రాజధాని కూడా. అందుకే విశాఖ జ్యూయల్ ఆఫ్ ఈస్ట్‌కోస్ట్‌గా పేరుపొందింది. కొన్ని సర్వేల ప్రకారం దేశంలోనే టాప్ టెన్ రిచెస్ట్ సిటీగా కూడా విశాఖ స్థానం సంపాదించుకున్నది.
 
విశాఖ పరిపాలన రాజధాని కాబోతున్న వేళ మరో అరుదైన స్థానం దక్కించుకున్నది. "టాప్ టెన్ రిచెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా 2020”లో వైజాగ్‌కు కూడా చోటు దక్కింది. ఓ ప్రైవేటు సంస్థ చేసిన సర్వేలో దేశ వ్యాప్తంగా పది నగరాలను ఎంపిక చేయగా అందులో విశాఖపట్నం కూడా ఉంది.
 
సూరత్, పూణె, ముంబయి, చెన్నై, కోల్ కత్తా, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్... వీటి సరసన విశాఖ నిలిచిందని ఆ సంస్థ సోషల్ మీడియాలో తెలిపింది. విశాఖలో 26 మిలియన్ల అమెరికన్ డాలర్ల జీడీపీ కలిగి ఉందని, అదేవిధంగా 1875 మిలియన్ అమెరికన్ డాలర్ల తలసరి ఆదాయంతో విశాఖ దూసుకో పోతుందని ఆ సంస్థ స్పష్టం చేసింది.
 
అందుకే విశాఖ టాప్ టెన్ రిచెస్ట్ సిటీస్ లిస్టులో చేరిపోయిందని వెల్లడించింది. అయితే విశాఖ ఆర్థిక పరిస్థితిని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు ప్రజల తలసరి ఆదాయంలో ఏపీలో మిగిలిన జిల్లాల కంటే విశాఖలో ఎక్కువ ఉందని అందుకే ఏపీ ప్రభుత్వం విశాఖను రాజధానిగా ఎంపిక చేసి ఉంటుందని అభిప్రాయపపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments