విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ముప్పు ... రైలు నుంచి వేరుపడిన బోగీలు

Webdunia
ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (12:20 IST)
విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు ఆదివారం పెనుముప్పు తప్పింది. ఏలూరు దగ్గర రన్నింగ్ ట్రైన్ నుంచి మూడు బోగీలు వేరుపడిపోయాయి. ఒక్కసారిగా బోగీలు రైలు నుంచి విడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైల్వే స్టేషన్‌లో నెమ్మెదిగా ఆగే సమయంలో లింకు తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
అయితే, బోగీల్లోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉండటంతో అటు రైల్వే అధికారులు, ఇటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఏలూరు రైల్వే స్టేషన్‌లో శనివారం సాయంత్రం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు షిర్డీ నుంచి వస్తున్న షిర్డీ ఎక్స్‌ప్రెస్, ఇటు విశాఖకు వెళ్లాల్సిన విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రైల్వే స్టేషన్‌లో బాగా నెమ్మదించాయి. 
 
ఆ సమయంలోనే విశాఖ ఎక్స్‌ప్రెస్ బోగీల లింకు వేరుపడింది. ఫలితంగా విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఎస్1, ఎస్2, ఎస్3 రైళ్లు బాగా విడిపోయాయి. అయితే ట్రైన్ చాలా నెమ్మదిగా వెళ్తున్న సమయంలో రైలు లింక్ ఊడిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

Rajamouli: రాజమౌళి సినిమానుంచి తీసేసిన ఆ వ్యక్తే ది రాజా సాబ్ విఎఫ్.ఎక్స్ లేట్ చేస్తున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments