Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్.జగన్ నా అన్న.. నా రక్తం... : మంచు విరానిక

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (14:42 IST)
వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డిపై మంచు ఫ్యామిలీ మరోమారు తమ వీరవిధేయతను చాటుకుంది. వైఎస్. జగన్ నా అన్న.. నా రక్తం అంటూ హీరో మంచు మనోజ్ భార్య మంచు విరానిక ఓ ట్వీట్‌లో స్పష్టం చేశారు. 
 
ఇటీవల తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని కోరుతూ ఆ సంస్థల అధినేత హీరో డాక్టర్ మోహన్ బాబు రోడ్డుపైకి వచ్చి నిరసనకు దిగారు. దీని వెనుక వైకాపా హస్తముందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. 
 
ముఖ్యంగా, మోహన్‌బాబు వారం రోజులుగా చెవిరెడ్డి అనే క్రిమిన‌ల్‌తో తిరుపతిలో తిరుగుతున్నారని, ముసుగు తీసి వైసీపీకి సపోర్ట్ చేయవచ్చు కదా? అని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. వీటిపై మంచు విరానికా స్పందించారు. 
 
"అసలు మంచు ఫ్యామిలీ వైసీపీకి ఎందుకు మద్దతు ఇవ్వకూడదని విరానిక ప్రశ్నించారు. 'నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతిస్తున్నానని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అసలు నేనెందుకు మద్దతివ్వకూడదు? ఒకవేళ మీకు దీనిపై స్పష్టత లేకపోతే, మీకు కొన్ని విషయాలు చెబుతాను. వైఎస్ జగన్.. నా అన్న, నా రక్తం. ఇక నా విషయానికి వస్తే, నాకెప్పుడూ నా కుటుంబమే ముఖ్యం' అంటూ ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments