ఏటీఎం నుండి డ్రా చేసిన డబ్బులు చూసి షాక్‌ అయిన కస్టమర్‌..!

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (15:42 IST)
ఏటీఎం నుండి నగదు డ్రా చేసిన వ్యక్తి డబ్బులను చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. డ్రా చేసిన సొమ్ములో చిరిగిన నోట్లు రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ ఘటన విజయవాడలోని మైలవరంలో వెలుగుచూసింది.
 
మద్దాలి గణేష్ అనే వ్యక్తి నారాయణ థియేటర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.30 వేలు డ్రా చేశాడు. అందులో 10 రెండు వేల రూపాయల నోట్లు చిరిగినవి వచ్చాయి. చిరిగిన నోట్ల విలువ రూ.20 వేలు ఉండడంతో అతను ఒక్కసారిగా విస్మయం చెందాడు.
 
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులను మోసం చేయడం దారుణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పలువురికి ఏటీఎంలో చిరిగిన నోట్లు దర్శనమిచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఇదివరకు కూడా అనేక మార్లు చిరిగిన నోట్లను ఏటీఎంలో పెట్టారని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతంకాకుండా చూసుకోవాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా బైకర్ నుంచి మోటివేషన్ యాంథమ్ జిద్ధి జిద్ధి రిలీజ్

Ajay Bhupathi: తిరుపతిలో శ్రీనివాస మంగాపురం మూడో కీలక షెడ్యూల్‌ పూర్తి

Manchu Manoj :డేవిడ్ రెడ్డి లో హీరోయిన్ గా మారియా ర్యాబోషాప్కా

Ranveer Singh: ధురంధర్ ది రివెంజ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్

సింగపూర్‌కు చేరుకున్న డిస్నీ అడ్వెంచర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments