Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్కె తీర్చమన్న భార్య.. నావల్ల కాదన్న భర్త... పోటీపడి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు!

ఓ భార్యాభర్తలు పోటీపడి శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తన కోర్కెను తీర్చాలని భర్తను భార్య కోరితే.. ఆ కోర్కె తీర్చడం తన వల్ల కాదని భార్యకు భర్త చెప్పాడు. ఆ తర్వాత వారిద్దరి వాగ్వాదం చోటు

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (14:24 IST)
ఓ భార్యాభర్తలు పోటీపడి శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తన కోర్కెను తీర్చాలని భర్తను భార్య కోరితే.. ఆ కోర్కె తీర్చడం తన వల్ల కాదని భార్యకు భర్త చెప్పాడు. ఆ తర్వాత వారిద్దరి వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వారిద్దరు పోటీపడిన కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. స్థానికలంగా కలకలం రేపిన ఈ ఘటన జయవాడ పరిధిలోని విద్యాధరపురం వెనుక రామాలయం సమీపంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే.. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తుండగా, లలితాదేవి ఆయన భార్య. వీరికి ముగ్గురు కుమార్తెలు. పిల్లల చదువుకు సంపాదన సరిపోవడం లేదని, ఖాళీగా ఉండకుండా ఆటో నడపాలని లలితాదేవి తన భర్తపై ఒత్తిడి తెస్తుండేది. ఈ నేపథ్యంలో విధులు నిర్వహించుకుని వచ్చిన భర్తపై మరోసారి వాగ్వాదానికి దిగింది. తాను ఆటో నడిపేది లేదని శ్రీనివాసరావు తెగేసి చెప్పాడు. 
 
అయితే, తాను బతకలేనని చెబుతూ, వంటగదిలోకి వెళ్లి కిరోసిన్ పోసుకుంది. తాను కూడా మరణిస్తానని అంటూ శ్రీనివాసరావు కూడా కిరోసిన్ పోసుకున్నాడు. లలితాదేవి వెలిగించిన అగ్గిపుల్ల ఇద్దరికీ అంటుకోవడంతో, ఆ దంపతులు కేకలు పెట్టారు. బయటవున్న పిల్లలు, చుట్టుపక్కల వారు వచ్చేవరకే వారు మంటల్లో కనిపించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రికి వారిని తరలించగా, ఇద్దరి పరిస్థితీ విషమంగానే ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments