Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయసాయి బెయిల్‌ రద్దుపై విచారణ ఈ నెల 13కు వాయిదా

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (14:05 IST)
ఒక‌ప‌క్క సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపైనా, మ‌రో ప‌క్క ఎంపీ విజ‌య‌సాయిపైనా ఎంపీ ర‌ఘ‌రామ త‌న విల్లు ఎక్కుపెట్టే ఉంచుతున్నారు. వారిద్ద‌రి బెయిల్ ర‌ద్దుకు ఆయ‌న న్యాయ‌పోరాటం కొన‌సాగిస్తున్నారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ‌రాజు దాఖ‌లు చేసిన‌ పిటిషన్ పై తదుపరి విచార‌ణను సీబీఐ కోర్టు ఈ నెల 13కు వాయిదా వేసింది. విజయసాయిరెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించారంటూ ఈ నెల 7న‌ రఘురామ కృష్ణ‌రాజు పిటిషన్ వేసిన విష‌యం తెలిసిందే. బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణలో భాగంగా విజయసాయిరెడ్డికి, సీబీఐకి కోర్టు నోటీసులు జారీ చేసింది.

ర‌ఘురామ వేసిన‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగానే ఈ రోజు విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. అయితే, కౌంటర్‌ దాఖలుకు మరింత గడువు కావాలని సీబీఐ అధికారులు కోరారు. ఈ నేప‌థ్యంలోనే విచార‌ణ వాయిదా ప‌డింది.

ఇప్ప‌టికే అక్ర‌మాస్తుల కేసులో సీఎం జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని ర‌ఘురామ వేసిన పిటిష‌న్‌పై కూడా కోర్టులో విచార‌ణ కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం