Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలు సాయం అడుగుతున్నాయ్: వెంకయ్య

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2015 (13:20 IST)
నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కొత్త కథ చెప్తున్నారు. పార్లమెంట్‌లో విభజన సందర్భంగా ప్రత్యేక హోదాను తెరపైకి తెచ్చిన వెంకయ్య నాయుడు.. ప్రస్తుతం దేశంలో ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలు ఇంకా సాయం కావాలని అడుగుతున్నాయని చెప్పుకొచ్చారు. 
 
అలాగే ఎన్డీఏ అధికారంలోకి వచ్చి 18 నెలలే అయ్యిందని, విభజన చట్టంలోని హామీలన్నింటికీ తమ సర్కారు తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఏపీకి హోదా ఇవ్వడంతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావన్నారు. హోదా అంశాన్ని నీతి అయోగ్ పరిశీలిస్తోందని పునరుద్ఘాటించారు. 
 
పనిలో పనిగా వెంకయ్య నాయుడు కాంగ్రెస్ పార్టీ హోదాపై చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టారు. పునర్విభజన చట్టం చేసినప్పుడు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదా? అని వెంకయ్య సూటిగా ప్రశ్నించారు. విభజన చట్టంలో హోదా అంశాన్ని ఆనాడు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌కు ప్రశ్నించే హక్కుంది కానీ, విమర్శించే అర్హత లేదని వెంకయ్య స్పష్టం చేశారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments