Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా వెనుకెవరున్నా ఎన్టీఆర్ వెన్నుపోటు గుర్తొస్తుంది... వెంకయ్య ఎవరినన్నారు?

ఇదేదో ఆలోచించాల్సిన విషయంలా లేదూ... ఈమధ్య కాలంలో భాజపా-తెదేపాకు మధ్య దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పైగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నోటి నుంచి ఎప్పుడూ రానిది వెన్నుపోటు వ్యవహారం ఇప్పుడు వచ్చింది. ఆయన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వారి గురించి మా

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (11:58 IST)
ఇదేదో ఆలోచించాల్సిన విషయంలా లేదూ... ఈమధ్య కాలంలో భాజపా-తెదేపాకు మధ్య దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పైగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నోటి నుంచి ఎప్పుడూ రానిది వెన్నుపోటు వ్యవహారం ఇప్పుడు వచ్చింది. ఆయన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వారి గురించి మాట్లాడి ఆసక్తిని రేకెత్తించారు.
 
ఇంతకీ విషయం ఏంటయా అంటే, నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రిలో నూతన భవనాల ప్రారంభానికి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఇండోర్ స్టేడియంల శంకుస్థాపన కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వెనుక చాలామంది కార్యకర్తలు, నాయకులు గుమిగూడారు. దీనితో ఆయన ఓ మాట అన్నారు.
 
అదేమిటంటే.. ‘ దయచేసి నా వెనుక ఎవరూ ఉండొద్దండీ. ఎందుకంటే 1984లో వెనుక ఉన్నవారు దివంగత ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారు. అప్పటినుంచి నాకు అనుమానమే. అందుకే ముందు ఉండాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వెన్నుపోటు వ్యాఖ్యలు ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియదు కానీ, ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం అప్పుడప్పుడు మామ ఎన్టీఆర్ ను చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారంటూ వ్యాఖ్యానిస్తుంటారు. అలాగే లక్ష్మీపార్వతి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుంటారు. మరి ఈ నేపధ్యంలో వెంకయ్య చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడుని ఏమయినా తాకుతాయా...? ఏమో?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments