Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిటిడి పాలకమండలిలోకి ఉపరాష్ట్రపతి కుమార్తె దీపా వెంకట్...

దాదాపు ఆరు నెలలుగా ఎదురుచూస్తున్న టిటిడి నూతన పాలకమండలి నియామక ప్రకటన ఈ వారంలో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన పాలకమండలిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె, సామాజిక సేవకురాలు దీప వెంకట్‌కు స్థానం లభించనుందని సమాచారం. అదేవిధంగా పీలేరుకు చెంద

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (17:09 IST)
దాదాపు ఆరు నెలలుగా ఎదురుచూస్తున్న టిటిడి నూతన పాలకమండలి నియామక ప్రకటన ఈ వారంలో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన పాలకమండలిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె, సామాజిక సేవకురాలు దీప వెంకట్‌కు స్థానం లభించనుందని సమాచారం. అదేవిధంగా పీలేరుకు చెందిన చల్లాబాబుకు చోటు లభించనుంది. 
 
తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి సిఫార్సుతో చల్లా బాబుకు బోర్డులో స్థానం కల్పిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా పాతబోర్డులోని సినీ నిర్మాత, దర్శకుడు రాఘవేంద్రరావుకు మరోసారి పాలకమండలిలో అవకాశం దక్కనుంది. 
 
అయితే గత రెండు నెలల వరకు కూడా వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్ పేరు వినబడకపోయినా తాజాగా ముఖ్యమంత్రి స్వయంగా అనుకుని మరీ ఆమెకు ఈ పదవి ఇవ్వనున్నారట. ఇదే విషయాన్ని వెంకయ్యనాయుడు దృష్టికి చంద్రబాబు కూడా తీసుకెళ్ళారట. టిటిడి బోర్డు సభ్యురాలిగా ఉండటం దీపా వెంకట్‌కు కూడా ఇష్టమేనంటున్నారు. శ్రీవారి చెంత ఉండటం ఎంతో మంచిదన్న ఆలోచన ఆమెది. అందుకే చంద్రబాబు చెప్పగానే దీప ఒకే అనేశారట. అయితే టిటిడి ఛైర్మన్ ఎవరన్నది మాత్రం ఇంకా ఫైనలైజ్ కాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments