Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ కుళ్లును ఒక్క యేడాదిలో కడిగిపారేయలేం : వెంకయ్య

Webdunia
శుక్రవారం, 3 జులై 2015 (10:52 IST)
దేశంలోసాగిన కాంగ్రెస్ యాభై ఏళ్ళ పాలనలో అన్ని వ్యవస్థలు కుళ్లుమయమయ్యాయని, ఆ కుళ్లును ఒక్క యేడాదిలోనే కడిగిపారేయలేమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. తానా సభల్లో పాల్గొనే నిమిత్తం ఆయన అమెరికాలోని డెట్రాయిట్‌కు గురువారం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తానా ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. 
 
కాగా అమెరికాలోని బీజేపీ ప్రవాస భారతీయ మిత్రులు వాషింగ్టన్‌ డీసీ మెట్రోపాలిటన్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో వెంకయ్య ప్రసంగించారు. హెర్న్‌డన్‌లోని చిన్మయ - సోమనాథ్‌ లోటస్‌హాల్‌లో జరిగిన ఈ సమావేశానికి న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, వర్జీనియా, ఉత్తర కరొలినా తదితర రాష్ట్రాల నుంచి పలువురు ప్రవాస భారతీయులు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ అన్ని వ్యవస్థలనూ కుళ్లబొడిచిందని.. ఈ కుళ్లును ఒక్క ఏడాదిలో కడిగిపారేయలేమన్నారు. దాదాపు గంటన్నరసేపు వెంకయ్య అనర్గళంగా ప్రాసలు, చలోక్తులు, విసుర్లతో చేసిన ప్రసంగం ప్రవాస భారతీయులను ఆకట్టుకుంది. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments