Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాత వాహనాలే.. కానీ కొత్త నెంబర్ ప్లేట్.. టీజీ.. టీఎస్‌గా మార్పు

Webdunia
బుధవారం, 18 జూన్ 2014 (12:07 IST)
తెలంగాణ రాష్ట్ర సిరీస్ టీఎస్ అని నిర్ణయించినప్పటికీ జిల్లా కోడ్ విషయంలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఏ కోడ్ కేటాయించాలనే దానిపై మల్లగుల్లాలు పడిన ప్రభుత్వం చివరికి తేల్చేసింది. మొదట టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని భావించినా, ఆ తర్వాత టీఎస్‌గా మార్పు చేస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. దీనిపై కేంద్రం నుంచి క్లియరెన్స్ రావడంతో టీఎస్ పేరుతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
 
ఆదిలాబాద్‌కు టీఎస్ 01, కరీంనగర్ - టీఎస్ 02...
తెలంగాణలోని వివిధ జిల్లాలకు వాహనాల రిజిస్ట్రేషన్ల కోడ్‌ల వివరాలను ఓసారి పరిశీలిస్తే.. ఆదిలాబాద్ జిల్లాకు టీఎస్ 1, కరీంనగర్ టీఎస్ 2, వరంగల్ టీఎస్ 3, ఖమ్మం 4, నల్లగొండ జిల్లాకు టీఎస్ 5 ను కేటాయించింది. అలాగే మహబూబ్ నగర్ జిల్లాకు టీఎస్ 6, రంగారెడ్డి టీఎస్ 7, 8... హైదరాబాద్ జిల్లాకు టీఎస్ 9 నుంచి 14 వరకు సిరీస్‌ను కేటాయించింది. ఇక మెదక్ జిల్లాకు టీఎస్ 15, నిజామాబాద్‌కు టీఎస్ 16 ను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది.
 
ఇకపోతే ఆర్టీసీ వాహనాల రిజిస్ట్రేషన్లు టీఎస్ జెడ్‌మొదలు కానున్నాయి. పోలీసు వాహనాలకు టీఎస్ పీ 09 సిరీస్‌ను కేటాయించారు. అలాగే రవాణా వాహనాలకు సంబంధించి టీ, యూ, వీ, డబ్ల్యూ, ఎక్స్, వై సిరీస్‌లను ఇకపై రిజిస్ట్రేషన్లకు ఉపయోగించనున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

Show comments