Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోండా ఉమా... నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు... చెప్పుదెబ్బలు తింటావు..!

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (19:13 IST)
ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ టీడీపీ నేత బోండా ఉమ ధ్వజమెత్తారు. "బోండా ఉమా... నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు... నీకు ముందుంది మొసళ్ల పండగ. కాలకేయుడిలాంటి నీకు మహిళలే బుద్ధి చెబుతారు. మహిళల పట్ల మరోమారు అమర్యాదగా మాట్లాడితే చెప్పుదెబ్బలు తింటావు" అంటూ హెచ్చరించారు. తమకేమీ పబ్లిసిటీ పిచ్చి లేదని పద్మ అన్నారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే బోండా ఉమ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. 
 
"నువ్వు ఒరేయ్ అంటే మేం ఒసేయ్ అనలేమా... అత్యాచారం జరిగిన మూడ్రోజుల తర్వాత ముఖానికి మేకప్ వేసుకుని పరామర్శకు వచ్చారు, అన్నీ అబద్ధాలే చెప్పారు" అంటూ వాసిరెడ్డి పద్మపై బోండా ఉమ విమర్శించారు. దీనిపై వాసిరెడ్డి పద్మ స్పందించారు. 
 
కాలకేయ ముఠాకు నాయకుడు చంద్రబాబు అని, ఇప్పుడు బోండా ఉమ కారణంగా చంద్రబాబుకు చెడ్డపేరు వచ్చిందని టీడీపీ వాళ్లే బోండా ఉమను తిడుతున్నారని ఎద్దేవా చేశారు. 
 
తనను మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి నుంచి దించేవరకు పోరాడాలని బోండా ఉమకు చంద్రబాబు చీరకట్టి పంపించాడని, బోండా ఉమ తన పేరును సార్థకం చేసుకుంటున్నాడని, టీడీపీ ఉత్తమ నారి బోండా ఉమ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
 
బోండా ఉమను ఇప్పటివరకు ఓ ఆకు రౌడీ అనుకున్నానని, తాజా పరిణామాలతో మరీ చిల్లర రౌడీ అని అర్థమైందని వ్యంగ్యం ప్రదర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments