Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ తమిళ సీనియర్ హీరోను చెప్పుతో కొట్టాలంటున్న వాసిరెడ్డి పద్మ

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (13:05 IST)
వైకాపా మహిళా నేత, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి ఓ తమిళ సీనియర్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తమిళ హీరోను చెప్పుతో కొట్టాలంటూ మండిపడ్డారు. ఇంతకీ ఆ తమిళ హీరో ఎవరో కాదు.. ఎవర్‌గ్రీన్ భాగ్యరాజా. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వారే కారణమంటూ ఈయన వ్యాఖ్యానించారు. 
 
ఈ వ్యాఖ్యలపై మహిళా లోకం ముక్తకంఠంతో ఖండిస్తోంది. దీంతో వాసిరెడ్డి పద్మ కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. అత్యాచార ఘటనలపై దారుణ వ్యాఖ్యలు చేసిన భాగ్యరాజాను చెప్పుతో కొట్టాలని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల మహిళలపై దాడులు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని చెప్పారు. 
 
ప్రజలపై ఎంతో ప్రభావాన్ని చూపించే సినీ రంగానికి చెందిన భాగ్యరాజా బాధ్యతారహితంగా మాట్లాడారని మండిపడ్డారు. మహిళలకు ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భాగ్యరాజాపై తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇదే విషయంపై తమిళనాడు ప్రభుత్వానికి తాను లేఖ రాస్తానని చెప్పారు.
 
కాగా, ఇటీవల చెన్నై నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగ్యరాజా పాల్గొని మాట్లాడుతూ, వివాహేతర సంబంధాల కోసం ఈరోజుల్లో మహిళలు భర్తలు, పిల్లల్ని చంపేస్తున్నారు. సెల్ ఫోన్ల వల్ల మహిళలు చెడిపోతున్నారు. రెండేసి సిమ్ కార్డులు వాడుతున్నారు. వారిపై అత్యాచారాలు, వేధింపులకు ఇది కూడా ఒక కారణంగా మారింది. పొల్లాచ్చి అత్యాచార ఘటనలో మగవాళ్ల తప్పు ఏమాత్రం లేదు. పైగా, ఆ అమ్మాయి ఇచ్చిన అవకాశం వల్లే అత్యాచారం జరిగిందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను మహిళలు ముక్తకంఠంతో ఖండించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments