వంగవీటి రాధాకృష్ణ - పుష్పవల్లి పెళ్లి ముహూర్తం ఖరారు

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2023 (16:06 IST)
దివంగత మాజీ నేత వంగవీటి మోహన్ రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వివాహం ఈ నల 22వ తేదీన అంరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వివాహానికి విజయవాడ సమీపంలోని మురళి రిసార్ట్ వేదిక కానుంది. 22వ తేదీ ఆదివారం రాత్రి 7.59 నిమిషాలకు వధువు పుష్పవల్లి మెడలో వంగవీటి రాధా మూడు ముళ్లు వేయనున్నారు. 
 
నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి, అమ్మాణి దంపతుల కుమార్తె జక్కం పుష్పవల్లితో వంగవీటి రాధకు గత నెల 3వ తేదీన నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే. తాజాగా వీరి వివాహ ముహూర్తం ఖరారు చేశారు. ఈ జంట వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వివాహానికి వంగవీటి అభిమానులతో పాటు వీఐపీల తాకిడి అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో విజయవాడ - నిడమానూరు పోరంకి రోడ్డులో మురళి రిసార్ట్స్‌లో ఈ పెళ్లి వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
కాగా, గత 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వంగవీటి రాధా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాలంలో ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments